సినీ ఇండస్ట్రీలో ఇప్పుడంతా అనువాద చిత్రాల హావా నడుస్తోంది. ఈ మధ్యకాలంలో రిమేక్ సినిమాలు విజయాలతో దూసుకుపోతున్నాయి. అందుకే అనువాద సినిమాలకు మరింత డిమాండ్ పెరిగింది. తెలుగు, కన్నడ, తమిళంలోని సినిమాలు దాదాపు మూడు భాషల్లో విడుదల అవుతూ వస్తున్నాయి. ఇటీవలె కన్నడ ఇండస్ట్రీ నుంచి ‘కాంతార’ సినిమా వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. తాజాగా ఆ విధంగానే తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘వేద’ సినిమా రానుంది.
కన్నడ స్టార్ హీరో అయిన శివరాజ్ కుమార్ నటించిన ‘వేద’ సినిమా గత ఏడాది డిసెంబర్ లో విడుదలైంది. ఆ సినిమా అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. శివరాజ్ కుమార్ నిర్మాతగాను వ్యవహరించిన ఈ సినిమాకి హర్ష డైరెక్షన్ చేశాడు. అర్జున్ జన్య సంగీతాన్ని అందించారు. ప్రస్తుతం అదే టైటిల్ తో ఫిబ్రవరి 9వ తేదీన ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది. ఈ సినిమాకి సంబంధించిన తెలుగు ట్రైలర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఇదొక సస్పెన్స్ మూవీ అని తెలుస్తోంది.