40 ఏళ్ల క్రితం స్టార్ హీరో కమల్ హాసన్, శ్రీదేవి జంటగా నటించిన ‘వసంత కోకిల’ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. ఇప్పుడు అదే టైటిల్‌తో బాబీ సింహా సినిమా రాబోతోంది. మధుర ఫిలిమ్ ఫ్యాక్టరీ, ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై ఈ సినిమా రూపొందుతోంది. జాతీయ అవార్డు గ్రహీత, విలక్షణ నటుడు అయిన బాబీ సింహా ఈ సినిమాలో హీరోగా చేస్తున్నారు. ఆయన సరసన కశ్మీర హీరోయిన్గా నటిస్తోంది. మలయాళంలో ‘వసంత ముల్లై’ అనే టైటిల్‌తో ఈ సినిమా విడుదల కానుంది.
ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్, సాంగ్స్ విడుదలయ్యాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. కన్నడ ట్రైలర్‌ను స్టార్ హీరో శివరాజ్ కుమార్ రిలీజ్ చేశారు. ఇటీవలె వాల్తేరు వీరయ్య సినిమాలో బాబీ విలన్‌గా చేశారు. ‘వసంత కోకిల’ సినిమాలో హీరో ఆర్య కూడా ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ట్రైలర్ మొదటి నుంచి చివరి వరకూ ఎంతో ఆసక్తిగా ఉంది. ‘వసంత కోకిల’ సినిమా ఫిబ్రవరి 10వ తేదిన థియేటర్లలో విడుదల కానుంది.