“పుష్ఫ” సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా అల్లు అర్జున్ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా అంతర్జాతీయంగా చాలా మందిని ఆకట్టుకుంది. తాజాగా అల్లు అర్జున్ కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి అరుదైన గౌరవం లభించింది. యూఏఈ నుంచి బన్నీ గోల్డెన్ వీసాను అందుకున్నారు. ఈ విషయాన్నీ బన్నీ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఒక మంచి అనుభూతిని ఇచ్చిన దుబాయ్ కి ధన్యవాదాలు తెలిపారు.
తనకు గోల్డెన్ వీసా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. కేవలం కొంత మందికి మాత్రమే యూఏఈ ఈ గోల్డెన్ వీసాను అందజేస్తూ ఉంటుంది. ఈ వీసా వల్ల పదేళ్ల వరకూ అక్కడ నివశించే అవకాశం ఉంటుంది. ఈ వీసా ఉన్న వారు అక్కడ వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు.