టాలీవుడ్(Tollywood)లో ప్రేమ కథల(Love Stories) ప్రవాహం పెరుగుతోంది. ఇప్పటి వరకూ తెలుగు తెరపై ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్(Feel good Love stories) సందడి చేశాయి. ఇటువంటి కథలకు ప్రేక్షకులు ఎప్పుడూ పట్టం కడుతూ విజయాన్ని అందిస్తుంటారు. లవ్ స్టోరీస్‌లో యూత్‌కి అవసరమైన అంశాలు సహజంగా ఉండటం వల్ల అటువంటి మూవీస్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. కొత్తవారి నుంచి వచ్చిన సినిమాలు కూడా రికార్డులను నెలకొల్పుతున్నాయి.
టూ సోల్స్ మూవీ ట్రైలర్:
ఫీల్ గుడ్ లవ్ స్టోరీ (Feel Good Love Stories) కాన్సెప్ట్ తో వస్తోన్న మరో తాజా చిత్రం టూ సోల్స్(Two Souls). ఈ సినిమాతో తెలుగు తెరకు హీరోగా త్రినాథ్ వర్మ(trinadh Varma), హీరోయిన్గా భావన(Bhavana) పరిచయం అవుతున్నారు. ఈ సినిమాను దర్శకుడు శ్రావణ్(Director Sravan) తెరకెక్కిస్తున్నాడు. ఇద్దరి పరిచయం ఎప్పటికీ యాధృచ్చికం కానే కాదు అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ కథ సాగుతుంది.
తాజాగా టూ సోల్స్(Two Souls) మూవీకి సంబంధించిన ట్రైలర్ (Trailer)ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ట్రైలర్ ను చూస్తే హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ, ఎమోషన్స్ వంటి సీన్స్ సున్నితంగా సాగుతున్నాయి. రెండు ఆత్మలు(Two souls) కలిసి సాగించే ప్రయాణ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీని ఏప్రిల్ 21వ తేదిన రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం టూ సోల్స్ మూవీ ట్రైలర్(Movie Trailer) సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది.