KRNL: వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ జిల్లాలో నూతన నియామకాలు చేపట్టారు. మాజీ ఎంపీ బుట్టా రేణుకను కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్తగా, కడిమెట్ల రాజీవ్ రెడ్డిని ఎమ్మిగనూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్గా నియమించారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. కాగా, రాజీవ్ రెడ్డి ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే మనువడు.