Mega Star ‘భోళా శంకర్’ పోస్టర్ పై దారుణమైన ట్రోలింగ్!
Chiranjeevi : వాల్తేరు వీరయ్యతో బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేశారు మెగాస్టార్ చిరంజీవి. 250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. మెగాస్టార్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత.. ఓ రీమేక్ చేస్తున్నారు చిరు. తమిళ్ మూవీ వేదాళం రీమేక్‌గా భోళా శంకర్ అనే సినిమా చేస్తున్నారు.
వాల్తేరు వీరయ్యతో బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేశారు మెగాస్టార్ చిరంజీవి. 250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. మెగాస్టార్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత.. ఓ రీమేక్ చేస్తున్నారు చిరు. తమిళ్ మూవీ వేదాళం రీమేక్‌గా భోళా శంకర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ మూవీ రీమేక్ కావడంతో.. మెగా ఫ్యాన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అది కూడా అస్సలు ఫామ్‌లో లేని మెహర్ రమేశ్ దర్శకుడు కావడం.. మెగా ఫ్యాన్స్‌లో జోష్ నింపడం లేదు. సమయం వచ్చినప్పుడల్లా.. ఈ రీమేక్ అసవరమా అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తునే ఉన్నారు. కానీ మెహర్ రమేశ్ మాత్రం దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఉగాది సందర్భంగా.. ఆగస్ట్ 11న, ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా.. చిరంజీవి, తమన్నా మరియు కీర్తి సురేష్‌లపై ఓ క్లీన్ పోస్టర్ని రిలీజ్ చేశారు. ఇదే ఇప్పుడు భోళా శంకర్ పై ట్రోలింగ్‌కు కారణమవుతోంది. ఈ పోస్టర్ ఏదో షాపింగ్ మాల్ కోసం ప్లాన్ చేసినట్టు ఉందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. యాడ్స్, హోర్డింగ్స్ పోస్టర్లా ఉందంటూ.. దానిపై పలు బ్రాండ్స్ వేసి మీమ్స్ వేస్తున్నారు. ఇంకొందరైతే.. ఫ్యాన్ మేడ్ పోస్టర్ కూడా ఇలా ఉండదని కామెంట్స్ చేస్తున్నారు. అసలు మెహర్ రమేష్ ఈ ప్రాజెక్ట్‌ను ఆపేయాలని.. ఇలాంటి ఘోరమైన పోస్టర్స్ రిలీజ్ చేయకండని.. దారుణాతి దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. మామూలుగానే ఇలాంటి వాటి కోసం ఎదురు చూస్తుంటారు ట్రోల్స్ రాయుళ్లు.. అలాంటిది మెగాస్టార్ రేంజ్‌కు ఇలాంటి పోస్టర్ పడితే.. ఊరుకుంటారా మరి!