NTR 30 : ఎన్టీఆర్ 30 షూటింగ్ రోజు రోజుకి వెనక్కి వెళ్తునే ఉంది. ఈ సినిమాను నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 5న రిలీజ్ చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించాడు కొరటాల శివ. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. అనుకున్న సమయానికి రిలీజ్ అయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.
ఎన్టీఆర్ 30 షూటింగ్ రోజు రోజుకి వెనక్కి వెళ్తునే ఉంది. ఈ సినిమాను నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 5న రిలీజ్ చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించాడు కొరటాల శివ. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. అనుకున్న సమయానికి రిలీజ్ అయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు.. పక్కా ప్లానింగ్‌తో చేసి ఉంటారు. కానీ ఇప్పుడు ముందుగా అనుకున్న ముహూర్తానికి ఎన్టీఆర్ 30ని లాంచ్ చేయలేకపోయారు. ఫిబ్రవరి 24న ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టి.. మార్చి 20 నుంచి రెగ్యూలర్ షూటింగ్ మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ తారక రత్న మరణంతో వాయిదా వేశారు. దాంతో ఈ సినిమా పూజా కార్యక్రమాలు నెల రోజులు వెనక్కి వెళ్లినట్టు తెలుస్తోంది. షూటింగ్ కూడా మరింత లేట్ అవనుందని అంటున్నారు. మార్చిలో లాంఛనంగా ప్రారంభించి.. ఏప్రిల్‌లో సెట్స్ పైకి వెళ్లే ఆలోచనలో ఉన్నారట. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. ఓపెనింగ్ ఈవెంట్‌ను మార్చి 18న నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఈ లోపు ఎన్టీఆర్ ఆస్కార్ ఈవెంట్‌కు వెళ్లి రానున్నాడు. అందుకే ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నారట. దాంతో నెక్స్ట్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ మరింత లేట్ అవనుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ప్రభాస్‌తో సలార్ మూవీ తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. సెప్టెంబర్‌లో సలార్ రిలీజ్ కానుంది. ఆ వెంటనే ఎన్టీఆర్ 31 మొదలు పెట్టాలని అనుకున్నాడు ప్రశాంత్ నీల్. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ 30 డిలే అవడంతో.. ఎన్టీఆర్ 31 ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనేది ఇప్పుడే చెప్పలేం. అయితే అనుకున్న సమయానికి కొరటాల షూటింగ్ కంప్లీట్ చేస్తే.. ఈ ఇయర్ ఎండింగ్ లేదా.. నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్‌లో ప్రశాంత్ నీల్ సినిమా స్టార్ట్ అవనుందని చెప్పొచ్చు. చూడాలి.. ఏం జరుగుతుందో!