Jr.NTR : ట్రిపుల్ ఆర్ మూవీతో ఆస్కార్ క్రేజ్‌తో గ్లోబల్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అలాంటి టైగర్ నుంచి నెక్స్ట్ ఎలాంటి సినిమా రాబోతోందా.. అని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. వాళ్ల ఊహాకు తగ్గట్టే ఎన్టీఆర్ 30ని తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ.
ఇటీవలె పూజా కార్యక్రమాలు జరుపుకుంది ఎన్టీఆర్ 30. రీసెంట్‌గానే ఈ సినిమాలో సెట్స్‌లో జాయిన్ అయ్యాడు తారక్. ఫస్ట్ షెడ్యూల్లో కొరటాల ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో షూటింగ్‌ను మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. శంషాబాద్ ఏరియాలో వేసిన పోర్ట్ సెట్స్‌లో నైట్ షూట్ చేస్తున్నారట. సముద్రం బ్యాక్ డ్రాప్లో వస్తున్న సినిమా కాబట్టి.. చీకట్లో అలలపై విలన్లను చెడుగుడు ఆడేస్తున్నాడట ఎన్టీఆర్. ఇప్పటికే ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లను రంగంలోకి దింపాడు కొరటాల. పైగా తన హీరో మృగాలతో ఫైట్ చేయబోతున్నాడని చెప్పేశాడు. దాంతో ఇప్పటి నుంచే ఈ సినిమా పై లెక్కలు పెరిగిపోతున్నాయి. ఎన్టీఆర్ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉంటుందనడంలో.. ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. విక్రమ్ సినిమాలో అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విన్న తర్వాత.. అలాంటి స్కోర్ మా హీరోకి కూడా ఇస్తే.. లైఫ్ టైం సెటిల్మెంట్ అంటున్నారు నందమూరి అభిమానులు. మరి ఎన్టీఆర్ 30 ఎలా ఉంటుందో చూడాలి.