Jr.NTR : ట్రిపుల్ ఆర్ తర్వాత సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం కొరటాల శివతో ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాను సముద్రం బ్యాక్ డ్రాప్లో భారీ బడ్జెట్‌తో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు.
ఎన్టీఆర్ 30లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మృగాల వేట ఎలా ఉండబోతోందా.. అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. ఆచార్య సినిమాతో ఫస్ట్ టైం ఫ్లాఫ్ ఫేజ్ చేశాడు కొరటాల శివ. జస్ట్ ఫ్లాప్ మాత్రమే కాదు.. ఈ సినిమాతో కొరటాల ఇమేజ్‌కు గట్టి డ్యామేజ్ జరిగింది. అందుకే.. ఎట్టి పరిస్థితుల్లోను ఎన్టీఆర్ 30తో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఫిక్స్ అయిపోయాడు కొరటాల. ఈసారి బౌండరీస్ క్రాస్ చేసి.. భారీ ఎమోషనల్ డ్రామ్ చేయబోతున్నానని.. తన సినిమాలోని మృగాలను భయపెట్టేందుకు.. తన హీరో ఏం చేశాడో.. పవర్ ఫుల్‌గా చూపించబోతున్నాడు. అయితే ఎన్టీఆర్ ఎలా కనిపించబోతున్నాడు.. క్యారెక్టర్ ఎలా ఉంటుంది.. అనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్‌గా మారింది. ఈ సినిమాలో డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట ఎన్టీఆర్. నెవర్ బిఫోర్ మాస్ రోల్లో కనిపించబోతున్నాడట. అది కూడా డ్యూయల్ రోల్ చేస్తున్నాడట ఎన్టీఆర్. తండ్రి కొడుకుగా నటిస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ రెండు క్యారెక్టర్స్‌లో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవల్లో ఉంటుందట. ఎన్టీఆర్ క్యారెక్టర్స్ వేరియేషన్ కోసం కొరటాల కాస్త గట్టిగానే హార్డ్ వర్క్ చేస్తున్నాడట. మొత్తంగా గతంలో ఎన్నడూ చూడని విధంగా.. ఎన్టీఆర్‌ని ప్రజెంట్ చేయబోతున్నాడు కొరటాల. దీంతో ఎన్టీఆర్ 30పై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ భారీ ప్రాజెక్ట్‌ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఎన్టీఆర్30 రిలీజ్ కానుంది.