Jr.NTR : ట్రిపుల్ ఆర్ మూవీతో ఆస్కార్ క్రేజ్‌తో గ్లోబల్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అలాంటి టైగర్ నుంచి నెక్స్ట్ ఎలాంటి సినిమా రాబోతోందా.. అని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. వాళ్ల ఊహాకు తగ్గట్టే ఎన్టీఆర్ 30ని తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ.
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ ఓ రేంజ్లో ఉంది. ట్రిపుల్ ఆర్ సినిమాతో హాలీవుడ్ లెవల్‌కి వెళ్లిపోయిన తారక్.. త్వరలోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అది కూడా బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. హిట్ మూవీ వార్ సీక్వెల్లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తున్నారనే న్యూస్ వైరల్‌గా మారింది. ఇదే నిజమైతే.. బాక్సాఫీస్ బద్దలు కాదు.. కనీవినీ రికార్డులు క్రియేట్ అవుతాయి. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్‌కి మాత్రం ఓ బాలీవుడ్ హీరో హ్యండ్ ఇచ్చాడనే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో 30వ సినిమా చేస్తున్నాడు. ఇటీవలె ఎన్టీఆర్ 30 సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. అయితే విలన్ ఎవరనేది ఇంకా ఫైనలైజ్ కాలేదు. ముందు నుంచి ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించబోతున్నట్టు వినిపించింది. కానీ ఇప్పుడు సైఫ్ ఈ సినిమాకు నో చెప్పాడనే టాక్ నడుస్తోంది. ప్రీ ప్రొడక్షన్ టైంలోనే సైఫ్ అలిఖాన్తో చర్చలు జరిపారట మేకర్స్.. కథ కూడా నెరేట్ చేశారట.. కానీ సైఫ్ మాత్రం నో చెప్పినట్లు టాక్. అందుకే ఇప్పటి వరకు అఫిషీయల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదని అంటున్నారు. అయితే ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. ఎన్టీఆర్‌కి విలన్ ఎవరనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. ఇప్పటికే కొరటాల.. తన కథలో మనుషుల కన్నా మృగాలే ఎక్కువగా ఉంటాయని అంటున్నాడు. అలాంటి మృగాలకు బాస్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. మరి ఫైనల్‌గా ఎన్టీఆర్ 30లో విలన్‌గా ఎవరిని తీసుకుంటారో చూడాలి.