టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. పాన్ ఇండియా లెవల్లో ‘మైఖేల్’ సినిమాను విడుదల కానుంది. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా రూపొందింది. నేడు ఈ సినిమా ట్రైలర్ ను నందమూరి బాలకృష్ణ రిలీజ్ చేశారు. 90వ దశకంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఇందులో మజిలీ ఫేమ్ ‘దివ్యాంశ కౌషిక్’ నటిస్తోంది. ఈ సినిమాలో హీరో వరుణ్ సందేశ్, తమిళ హీరో విజయ్ సేతుపతి విలన్ గా కనిపించనున్నాడు.
తమిళ డైరెక్టర్ గౌతమ్ మీనన్ కూడా ఇందులో కీలక పాత్ర పోషించాడు. అలాగే శరత్ కుమార్, వరలక్ష్మీ శరత్ కుమార్, అనసూయ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ట్రైలర్ చూస్తే మొత్తం స్టోరీని గౌతమ్ మీనన్ నెరేట్ చేస్తూ వచ్చాడు. రెండు వేర్వేరు గ్యాంగులకు మధ్య జరిగే వార్, అందులో ప్రేమ కథని జోడించి స్టోరీని రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు రంజిత్ జయకొడి దర్శకత్వం వహిస్తున్నాడు. సామ్ సిఎస్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. ఫిబ్రవరి 3న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.