హీరోయిన్ సాయిపల్లవి వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. డ్యాన్సర్ నుంచి ఈమె హీరోయిన్ గా మారింది. దక్షిణాదిలోనే మంచి నటిగా, ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతోంది. సినిమా హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుపోతోంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండే సాయిపల్లవి నటనకు ప్రాధాన్యత ఉండే సినిమాలే ఎంచుకుంటూ వస్తోంది. గత ఏడాది ఆమె నటించిన విరాటపర్వం, గార్గి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ప్రస్తుతం శివకార్తికేయన్ తో ఓ సినిమా చేస్తోంది. తాజాగా సాయి పల్లవికి భారీ ఆఫర్ వచ్చింది. తమిళ స్టార్ హీరో అజిత్ తో ఆమె కలిసి నటించనుంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఆ సినిమా రూపొందనుంది. ఆ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది.