‘డియర్ జిందగీ'(Dear Jindagi Movie) అంటూ రాజా రవీంద్ర(Raja Ravindra) ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రశాంతమైన కాలనీలో ఓ ఫ్యామిలీకి ఇబ్బందులు వస్తే ఓ తండ్రి తన ఫ్యామిలీని చూసి సొసైటీ గర్వపడేలా చేయడం ఈ మూవీ కథాంశం. ఈ క్రేజీ ఫ్యామిలీ డ్రామాతో ‘డియర్ జిందగీ’ మూవీ తెరకెక్కుతోంది. రాజారవీంద్ర సమర్పణలో ‘సాయిజా క్రియేషన్స్’, మహా సినిమా పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, నీల ప్రియా, మిర్చి కిరణ్, హర్షవర్ధన్ వంటివారు నటిస్తున్నారు.
ఈ మూవీకి పద్మారావ్ అబ్బిశెట్టి (పండు) దర్శకత్వం వహిస్తున్నారు. ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లిలు ఈ మూవీని రూపొందిస్తున్నారు. దర్శకుడు వి.వి.వినాయక్(Director VV Vinayak) చేతుల మీదుగా ఈ మూవీ పూజా కార్యక్రమాలు జరిగాయి. పూజ కార్యక్రమంలో నటుడు రాజా రవీంద్రపై వివి వినాయక్ క్లాప్ కొట్టగా, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ(Director Kalyan Krishna) కెమెరా స్విచ్ ఆన్ చేసి గౌరవ దర్శకత్వం వహించారు.
నటుడు రాజా రవీంద్ర(Raja Ravindra) మాట్లాడుతూ రెగ్యులర్‌గా కాకుండా కొత్త కాన్సెప్ట్‌తో సినిమా చేస్తున్నామన్నారు. ఈ మూవీలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. నిర్మాత శరత్ చంద్ర చల్లపల్లి మాట్లాడుతూ.. సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన వి. వి. వినాయక్ కి, కళ్యాణ్ కృష్ణకి ధన్యవాదాలు తెలిపారు. ఫ్రెండ్స్ తో కోలాబ్రేట్ అయ్యి ప్రేక్షకులకు మంచి కాన్సెప్ట్ సినిమాలు అందించేందుకు ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించినట్లు తెలిపారు. దర్శకుడు పద్మారావ్ అబ్బిశెట్టి (పండు) మాట్లాడుతూ..ఈ కథ రాయడానికి ఒక సంవత్సరం పట్టిందని, రాజా రవీంద్ర తనకు గాడ్ ఫాదర్ లాంటి వారని అన్నారు.
నటీనటులు- రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, నీల ప్రియా, మిర్చి కిరణ్, హర్షవర్ధన్, మొయిన్, యశస్విని. ప్రొడ్యూసర్స్ – ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి కో ప్రొడ్యూసర్ – క్రాంతి ముండ్ర డైలాగ్స్ – వినయ్ కొట్టి ఎడిటర్ – రాజ్ మేడ మ్యూజిక్ డైరెక్టర్ – ఎమ్. ఎబెనెజర్ పాల్ సినిమాటోగ్రఫీ – సిద్ధార్థ స్వయంభు పాటల రచయిత – రాంబాబు గోసాల అడిషనల్ రైటర్ – రఘురామ్ తేజ డైరెక్టర్ – పద్మారావ్ అబ్బిశెట్టి (పండు) పి ఆర్ ఓ – కడలి రాంబాబు