గత ఏడాది ‘స్వాతిముత్యం’ సినిమాతో వచ్చిన బెల్లంకొండ గణేష్(Bellamkonda Ganesh) ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నేను స్డూడెంట్ సార్(Nenu Student Sir Movie) అనే సినిమాతో ఈసారి అందర్నీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి గ్లింప్స్, టీజర్లు విడుదల అయ్యాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్‌తోనే మూవీ కాన్సెప్ట్‌పై కాస్త క్లారిటీ ఇచ్చేందుకు మేకర్స్ ట్రై చేశారు.
‘నేను స్టూడెంట్ సార్’ మూవీ ట్రైలర్:
ఈ మూవీ(Nenu Student Sir Movie)లో హీరో ఎంతో ఇష్టంగా ఓ ఐఫోన్ కొనుక్కుని దానికి బుచ్చిబాబు అని పేరు పెడుతాడు. ఫోన్ కొన్న ఆనందంలో ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు, వీడియోలు తీస్తుంటూ అనుకోకుండా ఓ హత్యకు సంబంధించిన వీడియోను కూడా తీస్తాడు. దాంతో ఆ హత్య చేసింది హీరోనే అని కమిషనర్ ఇరికించే ప్రయత్నం చేస్తాడు. హత్య చేసింది తను కాదని చెప్పినా హీరోను అరెస్ట్ చేస్తారు.
ఇంతకీ ఆ హత్య చేసింది ఎవరు? ఆ హత్యలో హీరోను ఇరికించడానికి కారణం ఏంటి అనేదే ఈ సినిమా(Nenu Student Sir Movie) కాన్సెప్ట్. ఇవంతా కూడా ట్రైలర్ లో చూపించారు. ట్రైలర్ చూస్తుంటే ఇలాంటి కథను మనం చాలాసార్లు చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. సముద్రఖనికి ఈ మూవీలో కీలక పాత్ర చేస్తున్నారు. రాఖీ ఉప్పలపాటి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో బెల్లంకొండ గణేష్(Bellamkonda Ganesh)కు జోడీగా అవంతిక దస్సాని నటించింది.