»Naga Babu And Raghavendra Rao Counter To Tammareddy Bharadwaja
RRR Movie: తమ్మారెడ్డి వ్యాఖ్యలపై నాగబాబు తీవ్రపదజాలం, రాఘవేంద్ర రావు కూడా..
తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Tammreddy Bharadwaja) ఆర్ ఆర్ ఆర్ సినిమా పైన చేసిన వ్యాఖ్యల మీద ప్రముఖ నటుడు, నిర్మాత నాగబాబు (Konidela Naga Babu), దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావులు (director raghavendra rao) స్పందించారు.
తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Tammreddy Bharadwaja) ఆర్ ఆర్ ఆర్ సినిమా (RRR cinema) పైన చేసిన వ్యాఖ్యల మీద ప్రముఖ నటుడు, నిర్మాత నాగబాబు (Konidela Naga Babu), దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావులు (director raghavendra rao) స్పందించారు. నాగబాబు తీవ్ర పదజాలంతో కౌంటర్ ఇచ్చారు. రాఘవేంద్ర రావు సాఫ్టుగానే ధీటుగా స్పందించారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోగా నటించిన, ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా లోని నాటు నాటు పాట (naatu naatu song) ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ (oscar best original song 2023) కేటగిరీలో నామినేట్ అయింది. దీనికి ఈ చిత్ర బృందం ప్రమోషన్స్ చేస్తోంది. దీనిపై తమ్మారెడ్డి విమర్శలు చేయగా, చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ఆయన వ్యాఖ్యలను తప్పుబట్టారు. తెలుగు వారికి, తెలుగు సినిమాకు ఆస్కార్ లాంటి అవార్డు వస్తే గర్వపడాల్సింది పోయి.. ఇలా అక్కసు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు పలువురు ట్వీట్ చేశారు.
‘మిత్రుడు భరద్వాజ్ కి, తెలుగు సినిమాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి, తెలుగు నటులకు ప్రపంచ వేదికలపై మొదటిసారి వస్తున్న పేరును చూసి మనం గర్వపడాలి. అంతే కానీ 80 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అని చెప్పడానికి నీ దగ్గర అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా?’ అని రాఘవేంద్ర రావు ట్వీట్ ద్వారా ప్రశ్నించారు. అదే ట్వీట్ లో… జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పీల్ బర్గ్ వంటి వారు డబ్బు తీసుకొని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్దేశ్యమా అని చురకలు అంటించారు.
మెగా సోదరుడు నాగబాబు అయితే తీవ్ర పదజాలంతో దూషించారు. “నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు R R R కి ఆస్కార్ కోసం” అని ట్వీట్ చేశారు. అంతేకాదు, RRR మీద కామెంటుకు వై.సీ.పీ. వారి భాషలో సమాధానం అంటూ కింద పేర్కొన్నారు. నాగబాబు వ్యాఖ్యలను నెటిజన్లు సమర్థించారు.
ఎవరు ఊహించని ఒక చక్కటి షాట్ తో సిక్స్ కొట్టి ఆటను ముగించారని, తప్పు లేదు మన తెలుగు వారిలోనె ఇంతటి ఈర్ష వుంటే దారిన పోయె దానయ్య కి ఉండడంలో తప్పు లేదు.. ఓ నెటిజన్ కామెంట్ చేసారు.
తెలుగు థింకర్ అనే ట్విట్టర్ హ్యాండిల్ తమ్మారెడ్డి వ్యాఖ్యలపై భగ్గుమన్నది. ‘జలగన్న ఇళ్లులు 6000 కోట్లంట.. అవి అమ్మేసి 600 సినిమాలు తియ్యి.. ఎవడు ఆపుతాడో నేను చూస్తా! అందులో ఒక్కటైన ఆస్కార్ కి వెళ్ళలేదో.. పడెల్ పడేల్మని పీకుతాంl’ అంటూ ట్వీట్ చేసింది.
కాగా, తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy Bharadwaja) ఆర్ ఆర్ ఆర్ సినిమా పైన ఇటీవల సంచలన వాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆస్కార్ (Oscar) కోసం పోటీ పడుతున్న ‘RRR’ సినిమా టీమ్ విమాన ఖర్చులకు పెట్టిన డబ్బుతో 8 సినిమాలు తియ్యొచ్చని, RRR’ సినిమా కోసం రూ. 600 కోట్ల బడ్జెట్ అయిందని, మళ్లీ ఆస్కార్ కోసం రూ.80 కోట్లు ఖర్చు చేశారని, అదే రూ.80 కోట్లతో 8 సినిమాలు చేయవచ్చునని ఆగ్రహం వ్యక్తం చేసారు. వాళ్లు ఊరికే ఫ్లైట్ టికెట్లకు రూ.80 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. ఇప్పటి రోజుల్లో వస్తున్న సినిమాలు సమాజం (Society) కోసం తీస్తున్న సినిమాలు కాదని, మన సంతృప్తి కోసమే మనం సినిమాలు తీసుకుంటున్నామన్నారు. అప్పుడప్పుడు సమాజానికి ఉపయోగపడే సినిమాలు కూడా తీయాలని, సమాజానికి ఏదైనా సందేశం ఇవ్వగల అవకాశం ఫిలింమేకర్స్ కు (Filmmakers) ఉంటుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై పలువురు చిత్ర ప్రముఖులు భగ్గుమన్నారు.