»Melody Song Release From Falana Abbaayi Falana Ammaayi
Naga Shaurya: ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్
టాలీవుడ్(Tollywood) హీరో నాగశౌర్య(Naga Shaurya) లవ్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. తాజాగా 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'(Falana abbaayi falana ammayi) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్ అయ్యింది.
టాలీవుడ్(Tollywood) హీరో నాగశౌర్య(Naga Shaurya) లవ్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. తాజాగా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'(Falana abbaayi falana ammayi) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాను విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మిస్తున్నారు. అవసరాల శ్రీనివాస్(Avasarala Srinivas) దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా తర్వాత అవసరాల శ్రీనివాస్ చేస్తున్న మరో లవ్ ఎంటర్ టైనర్ ఇది.
https://www.youtube.com/watch?v=6ML2qcZnPNU
టైటిల్ బట్టి చూస్తే ఇదొక ప్రేమకథ(Love story) అని ఎవ్వరికైనా అర్థమవుతుంది. పెద్దలతో ముడిపడిన ప్రేమకథ కావడంతో ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అవ్వనుంది. ఈ మూవీలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన లిరికల్ వీడియో సాంగ్(Lyrical Video Song) ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
”కనులచాటు మేఘమా కాస్త ఆగుమా..వెనుకరాని నీడతో రాయబారమా” అంటూ ఈ పాట అందర్నీ కట్టిపడేస్తోంది. హీరోహీరోయిన్లపై ఈ పాట సాగుతుంది. కల్యాణి మాలిక్(Kalyani malik) ఈ పాటను స్వరపరిచారు. ఈ పాటకు సాహిత్యాన్ని లక్ష్మి భూపాల్ అందించారు. సినిమాలోని ప్రేమికులు గడిపిన మధుర క్షణాలను ఈ పాటలో చూపించారు. ఈ మెలోడీ సాంగ్(Melody Song) అందర్నీ ఆకట్టుకుంటుందనే చెప్పాలి. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్(Movie Release Date)ను చిత్ర యూనిట్ ప్రకటించనుంది.