ప్రముఖ నటి ఇలియానా (Ileana) తాజాగా ఓ ఫోటోను షేర్ చేసి మరింత ఆసక్తి పెంచింది. అందులో కుక్కతో ఆడుకుంటున్న వ్యక్తి తన ముఖం కనిపించకుండా కిందికి దించేశాడు. దీంతో అతడెవరన్నది చర్చనీయాంశమైంది. వివాహం (marriage) కాకుండానే తల్లయినట్టు ప్రకటించి సంచలనం సృష్టించిన నటి ఇలియానా.. తన బేబీబంప్ ఫొటో(Baby bump photo)లను ఎప్పటికప్పుడు పోస్టు చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. అయితే, పుట్టబోయే ఆ బిడ్డకు తండ్రి ఎవరన్న విషయాన్ని ఇలియానా ఇప్పటి వరకు బయటపెట్టలేదు.
దీంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. తాను తల్లిని కాబోతున్నట్టు ఈ ఏడాది ఏప్రిల్ 18న ఇలియానా ప్రకటించింది. అయితే, అందుకు కారణమైన వ్యక్తి వివరాలను మాత్రం రహస్యంగా ఉంచింది. తరచూ అతడి ఫొటోలను సోషల్ మీడియా(Social media)లో షేర్ చేస్తున్నా ముఖం మాత్రం కనిపించకుండా జాగ్రత్త పడుతోంది. తాజాగా, తన ఇన్స్టాగ్రామ్ (Instagram) స్టోరీస్‌లో బాయ్‌ఫ్రెండ్ బ్లాక్ అండ్ వైట్ ఫొటోను షేర్ చేసినప్పటికీ మళ్లీ ముఖాన్ని దాచేసింది. దానికి ‘పప్పీ లవ్’ అని క్యాప్షన్ తగిలించింది. ఆమె బాయ్‌ఫ్రెండ్ అందులో శునకాన్ని కిస్ చేస్తూ కనిపించాడు.