»Huge Openings For Controversial Movie Kerala Story
Kerala Story: కాంట్రవర్శీ సినిమా ‘కేరళ స్టోరీ’కి భారీ ఓపెనింగ్స్!
ఈ మధ్య కాలంలో కేరళ స్టోరీ సినిమాపై జరిగినంత వివాదం.. మరో సినిమాకు జరగలేదనే చెప్పాలి. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక.. వివాదం మరింత ముదిరింది. ఎట్టి పరిస్థితుల్లోను కేరళ స్టోరీని థియేర్లోకి తీసుకు రావద్దని నిరసనలు చేశాయి రాజకీయ పార్టీలు. కానీ ఎన్నో అవాంతరాలను అధిగమించి.. ఎట్టకేలకు మే 5న 'ది కేరళ స్టోరీ' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు జరిగిన కాంట్రవర్శీ వల్ల భారీ పబ్లిసిటీ వచ్చింది. దాంతో ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ వచ్చినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో కేరళ స్టోరీ సినిమా(Kerala Story Movie) ప్రదర్శన నిలిపివేయాలని నిరసనలు జరుగుతున్నా, బందోబస్తు నడుమ సినిమాను ప్రదర్శిస్తున్నారు. కేరళలో పలు సినిమా థియేటర్ల ముందు అధికార, ప్రతిపక్ష నేతలు నిరసనలు చేపట్టారు. సినిమా ప్రదర్శన నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. దాంతో ఈ సినిమాను ప్రదర్శించే అన్ని మల్టీప్లెక్స్‌లు, థియేటర్ల దగ్గర మరింత భద్రతను పెంచారు. హైదరాబాద్(Hyderabad)లోను అలెర్ట్ అయ్యారు. అయినా కేరళ స్టోరీ సెన్సేషన్‌గా నిలిచింది. డే వన్ నుంచి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సుదీప్తో సేన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అదా శర్మ(Ada Sharma) కీ రోల్ ప్లే చేసింది.
కేరళలో 32 వేల మంది యువతులు, మహిళలు అదృశ్యమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటనలతోనే సినిమాను తెరకెక్కించారు. అందుకే ఈ సినిమా ఇంత కాంట్రవర్శీ అవుతోంది. అయినా భారీ వసూళ్లను రాబడుతోంది. మొదటి రోజు దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల వరకు వసూళ్లు సాధించినట్టు తెలుస్తోంది. ఇది కూడా జస్ట్ అంచనా మాత్రమేనని అంటున్నారు. రెండో రోజు ఈ సినిమా వసూళ్లు మరింతగా పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు. ఎందుకంటే.. స్వయంగా పీఎం నరేంద్ర మోదీ ‘ది కేరళ స్టోరీ'(Kerala Story)పై ప్రశంసలు కురిపించారు. కర్నాటకలో జరిగిన ఎన్నికల ర్యాలీలో కేరళ స్టోరీని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలను విమర్శించారు. ఉగ్రవాదం, దాని ఆకృత్యాలను ఈ సినిమాలో దర్శకుడు బయటపెట్టారని ప్రశంసించారు. దీంతో కేరళ స్టోరీ(Kerala Story Movie) దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసేలానే ఉంది.