Natural Star Nani నటిస్తున్న ఊరమాస్ మూవీ దసరా.. మర్చి 30న రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో తెరకెక్కుతున్న.. ఈ రా అండ్ విలేజ్ యాక్షన్ డ్రామాలో.. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. నాని నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇదే.
న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న ఊరమాస్ మూవీ దసరా.. మర్చి 30న రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో తెరకెక్కుతున్న.. ఈ రా అండ్ విలేజ్ యాక్షన్ డ్రామాలో.. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. నాని నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇదే. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్.. సినిమా పై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. ఈ సినిమా హిట్ అయితే నాని రేంజ్ మారిపోతుంది.. ఇక పై అతని కథల ఎంపిక కూడా మారుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన వరుస అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. అలాగే రిలీజ్ టైం దగ్గర పడడంతో.. భారీ ఎత్తున ప్రమోషన్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో దసరా నుంచి థర్డ్ సింగిల్ రిలీజ్ చేసేందుకు టైం ఫిక్స్ చేశారు. ఇంతకు ముందు ‘దసరా’ సినిమా నుంచి రిలీజ్ అయిన రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. సోషల్ మీడియాలో ధూందాం దోస్తాన్, ఓరి వారి సాంగ్స్ మార్మోగిపోతున్నాయి. ఇక ఇప్పుడు మూడో పాట ‘చమ్కీల అంగేసి’ అనే ఫోక్ మెలోడిని రిలీజ్ చేయబోతున్నారు. మార్చి 8న ఈ సాంగ్ వెడ్డింగ్ సీజన్‌కు గిఫ్ట్‌గా ఇస్తున్నామని.. సాలిడ్ పోస్టర్‌తో అనౌన్స్ చేశారు మేకర్స్. ఇందులో నాని, కీర్తి సురేష్ స్కూటర్ పై కూర్చోని ఎక్కడికో వెళ్తున్నారు. నాని, కీర్తి లుక్ మాత్రం అదిరిపోయింది. కాబట్టి దసరాలో ఈ పెళ్లి పాట అదిరిపోతుందని చెప్పొచ్చు. ఈ పాటను పాన్ ఇండియా లెవల్లో అన్ని భాషల్లోను విడుదల చేయనున్నారు. పోస్టర్‌లోను ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. మరి దసరా థర్డ్ సింగిల్ ఎలా ఉంటుందో చూడాలి.