కన్నడ ఇండస్ట్రీ(Kannada Industry) నుంచి మరో భారీ యాక్షన్ మూవీ(Action Movie) రాబోతోంది. కన్నడ హీరో ధృవ సర్జా(Dhruva Sarja) నటిస్తున్న ''మార్టిన్''(Martin) చిత్రం భారీ యాక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కింది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్(Teaser) ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు.
కన్నడ ఇండస్ట్రీ(Kannada Industry) నుంచి మరో భారీ యాక్షన్ మూవీ(Action Movie) రాబోతోంది. కన్నడ హీరో ధృవ సర్జా(Dhruva Sarja) నటిస్తున్న ”మార్టిన్”(Martin) చిత్రం భారీ యాక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కింది. చాలా రోజుల తర్వాత ధృవ సర్జా(Dhruva Sarja) అద్భుతమైన యాక్షన్‌తో ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఏపీ అర్జున్ దర్శకత్వం వహిస్తున్నారు. వాసవి ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఈ సినిమాను ఉదయ్ కె మెహతా తెరకెక్కిస్తున్నారు. ఇండియాలోనే అతి పెద్ద యాక్షన్ డ్రామా మూవీగా ఈ సినిమా రూపొందింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్(Teaser) ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ధృవ సర్జా(Dhruva Sarja) ఇందులో ఇరగదీశాడు.
అర్జున్ సార్జా ఈ సినిమాకు కథను అందించడం విశేషం. కేజీఎఫ్ ఫేం రవి బస్రూర్ ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించారు. అలాగే మణిశర్మ(Manisharma) ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో వైభవి శాండిల్య, అన్వేషి జైన్, చిక్కన్న, మాళవికా అవినాష్, అచ్యుత్ కుమార్, నవాబ్ షా, నికిటిన్ ధీర్, రోహిత్ పాఠక్ వంటివారు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.
”మార్టిన్”(Martin) సినిమా టీజర్లో అద్భుతమైన యాక్షన్ సీన్స్ మనం చూడొచ్చు. ఈ టీజర్ ను బట్టి చూస్తుంటే ఇందులో ధృవ సర్జా(Dhruva Sarja) తన విశ్వరూపాన్నే చూపించారు. ఇందులో సర్జా గెటప్ మొత్తం మారిపోయింది. ‘పొగరు’ సినిమాలో గుబురు గడ్డంతో కనిపించిన ధృవ సర్జా(Dhruva Sarja) ఈ సినిమా మాత్రం క్లీన్ షేవ్‌తో కనిపిస్తాడు. మాస్ లుక్ లో కండలు తిరిగిన దేహంతో అలరిస్తాడని తెలుస్తోంది. ఈ సినిమా టీజర్(Teaser)ను చూస్తుంటే ఇదొక స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
హీరో పాకిస్థాన్ కు వెళ్లి అక్కడ కొన్ని గ్రూపులతో పోరాటాలు చేయడం టీజర్లో(Teaser) చూడొచ్చు. అలాగే ఈ సినిమా విజువల్స్, టేకింగ్ అద్భుతంగా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే ఇదొక పాన్ ఇండియా సినిమా(Pan India Movie)గా అనిపిస్తోంది. యూ థింక్ యువర్ స్ట్రాంగ్..అండ్ ఐనో ఐయామ్ స్ట్రాంగ్ అని హీరో చెప్పే డైలాగులు అద్భుతంగా ఉన్నాయి. ఈ మూవీని ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందుకోసం చిత్ర యూనిట్ సన్నద్ధమవుతోంది.