బాలీవుడ్(Bollywood) స్టార్ హీరో షాహిద్ కపూర్(Shaahid kapur) నటిస్తోన్న సినిమా బ్లడీ డాడీ(Bloody Daddy). తెలుగు సినిమాలు అయిన అర్జున్ రెడ్డి(Arjun Reddy), జెర్సీ(Jersy) వంటి సినిమాలను షాహిద్ కపూర్ హిందీలో రీమేక్ చేసి విజయం సాధించారు. బాలీవుడ్లో విభిన్న కథాంశాలతో షాహీద్ కపూర్ సినిమాలు తీస్తుంటాడు. ఈ మధ్యనే ఫర్జీ(Farji) అనే వెబ్ సిరీస్(Webseries) చేసి షాహిద్ మరింత క్రేజ్ సాధించారు.
‘బ్లడీ డాడీ’ సినిమా టీజర్ :
షాహిద్ కపూర్(Shaahid Kapur) ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నాడు. అందులో బ్లడీ డాడీ(Bloody Daddy) కూడా ఒకటి. ఈ మూవీకి అలి అబ్బాస్ జఫార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ‘న్యూట్ బ్లాంచే’ అనే ఫ్రెంచ్ మూవీ ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి ఈ మధ్యనే ఫస్ట్ లుక్ రిలీజ్(First Look Release) అయ్యింది.
తాజాగా బ్లడీ డాడీ(Bloody Daddy) సినిమా నుంచి చిత్ర యూనిట్ టీజర్ రిలీజ్(Teaser Release) చేశారు. ఈ టీజర్ మొత్తం హింసతో, రక్తపాతంతో నడుస్తోంది. మాఫియా, డ్రగ్స్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతోందని టీజర్ చూస్తేనే తెలుస్తోంది. ఈ మూవీ మొత్తం హీరో నెరేటీవ్ లో సాగుతుంది. ఒక్క రాత్రిలో జరిగే సంఘటనలనే సినిమాగా తీస్తున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ థ్రిల్లర్(Action Thriller) నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతోంది. ఈ మూవీ జియో సినిమా ఓటీటీ(OTT)లో జూన్ 9 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.