Matti katha Movie: ‘మట్టికథ’కు 3 అంతర్జాతీయ అవార్టులు
పల్లెటూరు అంటే పండగలు, పబ్బాలకు మాత్రమే ఇంటికెళ్లే ఊరు అన్నట్లు మారిపోయిన ఈ కాలంలో..పల్లెటూరి కుర్రోడి ఆశలు, ఆకాంక్షలు ఎలా ఉంటాయనే కథాంశంతో మట్టికథ మూవీ తెరకెక్కింది. తాజాగా ఈ మూవీకి మూడు అంతర్జాతీయ అవార్డులు లభించాయి.
తెలంగాణ(Telangana) పల్లె నేపథ్యంలో సినిమాలు వస్తూ మంచి విజయాలను సాధిస్తున్నాయి. తాజాగా ‘మట్టికథ'(Matti Katha Movie) కూడా ఆ సరసన నిలిచింది. మనుషులకు మట్టితో ఉండే అనుబంధాన్ని తెలుపుతూ ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఈ మూవీకి ఇప్పుడు మూడు అంతర్జాతీయ అవార్డులు(International Awards) లభించాయి. ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(Indo French International Festival)లో మట్టికథకు 3 అవార్డులు దక్కాయి. బెస్ట్ ఇండియన్ ఫ్యూచర్ ఫిల్మ్, బెస్ట్ యాక్టర్ ఫ్యూచర్ ఫిల్మ్ అవార్డుతో పాటుగా డెబ్యూట్ ఫిల్మ్ మేకర్ ఆఫ్ ఫ్యూచర్ ఫిల్మ్ అవార్డు కూడా దక్కింది.
మట్టికథ(matti katha)కు మూడు అవార్డులు రావడంతో ఈ సినిమాపై అందరిలో అటెన్షన్ బజ్ నెలకొంది. ఇదే ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘బలగం’ సినిమా(Balagam Movie)కు కూడా గతంలో పలు అవార్డులు దక్కాయి. బెస్ట్ యాక్టర్ గా ప్రియదర్శి(Actor Priyadarshi) ఎంపికైన సంగతి తెలిసిందే. అదే కేటగిరిలో ఇప్పుడు మట్టికథ సినిమా హీరో అజయ్ వేద్(Hero Ajay ved) ఎంపికయ్యాడు. దీంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. ఇదే ఫిల్మ్ ఫెస్టివల్లో ‘మమ్మనీతమ్’ అనే తమిళ సినిమాకు కూడా హీరో విజయ్ సేతుపతి(Hero Vijaysethupathi)కి ఉత్తమ నటుడిగా అవార్డు లభించింది. తాజాగా ఆ సినిమాల సరసన ఇప్పుడు మట్టికథ చేరింది.
ఈ మూవీ(matti katha)కి కడియాల దర్శకత్వం వహించారు. అన్నపరెడ్డి, సతీశ్ మంజీర నిర్మాతలుగా వ్యవహరించారు. జానపద గాయని కనకవ్వ, బలగం తాత సుధాకర్ రెడ్డి, దయానంద్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. స్మరన్ సాయి ఈ మూవీకి సంగీతం అందించారు. ఇటీవలె ఈ మూవీ ట్రైలర్, ఫస్ట్ లుక్ను రచయిత విజయేంద్ర ప్రసాద్(Writer Vijayendra Prasad) రిలీజ్ చేశారు.