MBNR: కొడంగల్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ఎస్.లక్ష్మణ్ జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యాడు. తాండూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్-14 పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన లక్ష్మణ్.. త్వరలో రాజస్థాన్లో జరగనున్న జాతీయ పోటీల్లో తెలంగాణ తరఫున పాల్గొననున్నాడు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రాందాస్, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు.