VSP: గాజువాకలో ఇవాళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. రైతు బజార్ వద్ద కూరగాయలు అమ్మే మహిళ రోడ్డు దాటుతుండగా RTC బస్సు ఢీకొట్టినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో మహిళ చేయి నుజ్జు నుజ్జు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు వారు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.