US అధ్యక్షుడు ట్రంప్ వెనిజులా అధ్యక్షుడు మదురోను అరెస్ట్ చేసి తీసుకెళ్లడంపై MIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ‘ట్రంప్ వేరే దేశ అధ్యక్షుడినే ఎత్తుకెళ్లగలిగినప్పుడు.. ప్రధాని మోదీ పాకిస్థాన్ వెళ్లి 26/11 దాడుల సూత్రధారిని ఇండియాకు ఎందుకు తీసుకురాలేరు?’ అని ముంబై వేదికగా ప్రశ్నించారు. ట్రంప్ చేయగలిగింది.. మీరు ఎందుకు చేయలేకపోతున్నారని మోదీకి సవాల్ విసిరారు.