PPM: సాలూరు మండలం కురుకుట్టి, ఎగువ కాసాయి, దిగువ కాసాయి గ్రామాల నుంచి మొత్తం 150 కుటుంబాలు టీడీపీలో శనివారం చేరాయి. పార్టీలో చేరిన వారికి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కండువాలు కప్పి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ ప్రభుత్వం ప్రజలకు న్యాయపాలన అందించేందుకు కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు.