WGL: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన కిసాన్ పోర్టల్లో రైతులందరూ తమ వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని రాయపర్తి మండల వ్యవసాయ అధికారి వీరభద్రం సూచించారు. ఈ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే పీఎం కిసాన్ సమ్మాన్ నిధితో పాటు ఇతర సంక్షేమ పథకాలు, రాయితీలు అందుతాయని ఆయన స్పష్టం చేశారు. రైతులు వెంటనే స్థానిక ఏఈవోలను సంప్రదించాలని స్పష్టం చేశారు.