BHNG: రాజపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో ‘వేస్ట్ టు హెల్త్’ కార్యక్రమం నిర్వహించారు. స్టేట్ కోఆర్డినేటర్ రాధిక, ఎంఈవో రమేష్ ప్రారంభించారు. ఆలేరు, రాజపేట, యాదగిరిగుట్ట మండలాల నుంచి 28 పాఠశాలల విద్యార్థులు వ్యర్థ పదార్థాలతో తయారు చేసిన వినూత్న ప్రదర్శనలను ప్రదర్శించారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.