Dry Friut Jewellery: చిన్న పార్టీ లేదా ఏదైనా ఫంక్షన్ ఉందంటే చాలు.. అమ్మాయిలు అందంగా రెడీ అవుతుంటారు. కేవలం అందంగా మాత్రమే కాకుండా అందరిలో కొత్తగా కనిపించాలని ఆరాటపడుతుంటారు. అలా అని చీర నుంచి ధరించే నగలు వరకు అన్ని కొత్తగా ఉండటంతో పాటు అందరిలో డిఫరెంట్‌గా ఉండాలనుకుంటారు. ఇటీవల ఓ మహిళ సీమంతం కోసం అందంగా తయారు కావడంతో పాటు డిఫరెంట్‌గా ఉంది. పట్టుచీరను కట్టుకుని.. ఒంటి నిండా నగలు ధరించింది.
ఈ నగలు అసలైనవికావు. డ్రై ఫ్రూట్స్‌తో తయారైన ఆభరణాలను ధరించిందది. జీడిపప్పు, బాదం, పిస్తాలతో తయారుచేసి వేసుకుంది. వీటితో బలంగా చేసి మెడలో వేసుకుంది. నక్లెస్, గాజులు, చెవిపోగులు, హెయిర్ బ్యాండ్, వడ్డాణం.. వంటి ఆభరణాల స్టయిల్లో ఆమె డ్రై ఫ్రూట్స్, నట్స్‌తో చేసిన వస్తువులను ధరించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.