NZB: మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల రవాణా, విక్రయం, వినియోగంపై గట్టి నిఘా కొనసాగించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయి చైతన్య సూచించారు. మంగళవారం మత్తు పదార్థాల నిరోధక కమిటీ జిల్లాస్థాయి సమావేశం జరిగింది. మత్తు పదార్థాల నియంత్రణకు చేపట్టిన చర్యలపై చర్చించి, వాటి నిరోధానికి అవలంభించాల్సిన చర్యలపై అధికారులకు కలెక్టర్, సీపీ దిశానిర్దేశం చేశారు.