Will you meet CM Revanth Reddy soon.. Former Minister Mallar Reddy
Mallar Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డి(Mallar Reddy) త్వరలో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని కలువనున్నట్లు మీడియాతో చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తాను కలల కూడా అనుకోలేదని వెల్లడించారు. ఆ విషయాన్ని ఇప్పుడిప్పుడు జీర్జించుకుంటున్నట్లు ఆయన తెలిపారు. మల్కాజిగిరి పార్లమెంటరీ స్థానం నుంచి తనను పోటీ చేయమని అడుగుతున్నారని, కానీ తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినట్లు మల్లారెడ్డి చెప్పారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలువబోతున్నట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రిని కలుస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. ఏ వివాధాలు తలెత్తకుండా ఆయన్ను కలిసే రోజు మీడియాకు ముందే చెప్తా అని పేర్కొన్నారు.
గతంలో ఇద్దరు కలిసి టీడీపీ పార్టీలో పనిచేసినట్లు ఆయన గుర్తు చేశారు. ఇది వరకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముగ్గురు ముఖ్యమంత్రిని కలవడంతో మీడియాలో, పార్టీలో పెద్ద చర్చ కొనసాగింది. ఈ నేపథ్యంలో ముందుగానే అందరికి సమాచారం ఇచ్చి సీఎంను కలుస్తా అని మల్లారెడ్డి తెలపడం విశేషం.