SSMB 28 ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్, పూజా కార్యక్రమం, షూటింగ్.. అన్ని కూడా కొన్ని నెలల గ్యాప్‌తోనే మొదలయ్యాయి. అలవైకుంఠపురంలో సినిమా తర్వాత కాస్త గ్యాప్‌తో త్రివిక్రమ్ చేస్తున్న సినిమా ఇదే. పైగా 12 ఏళ్ల తర్వాత మహేష్, త్రివిక్రమ్ ఈ సినిమా చేస్తున్నారు. మొత్తంగా చాలా గ్యాప్‌తో రీసెంట్‌గానే సెట్స్ పైకి వెళ్లింది ఈ సినిమా. అందుకు సంబంధించిన మేకింగ్ వీడియో కూడా రిలీజ్ చేశారు. కాకపోతే అందులో మహేష్ బాబు లుక్‌ను రివీల్ చేయలేదు. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పుడు SSMB 28 ఆరంభం అంటూ చెప్పుకొచ్చారు. దాంతో ఇప్పుడు టైటిల్ గురించి జోరుగా చర్చ జరుగుతోంది.
వచ్చే సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామని ప్రకటించినప్పటికీ.. టైటిల్ మాత్రం అనౌన్స్ చేయలేదు. ఆ మధ్యలో ‘అర్జునుడు’ అనే టైటిల్ వినిపించింది. కానీ అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. అయితే ఇప్పుడు ‘ SSMB 28 ఆరంభం’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవడంతో.. ఈ సినిమాకు ‘ఆరంభం’ అనే టైటిల్ ఫిక్స్ చేసి ఉండొచ్చనే సందేహాలు వెలువడుతున్నాయి. పైగా త్రివిక్రమ్‌కు ‘అ’ సెంటిమెంట్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ‘అతడు’ మొదలుకొని ‘అలవైకుంఠపురంలో’ సినిమా వరకు ‘అ’ సెంటిమెంట్‌నే వాడాడు. ఈ లెక్కన మహేష్ బాబు సినిమాకి ‘ఆరంభం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని ప్రచారం జరుగుతోంది. అయితే ఒకవేళ నిజంగానే ఇదే టైటిల్ ఫిక్స్ చేస్తే.. రివీల్ చేయడంలో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. కానీ దీనికి కూడా సినిమా మధ్యలో టైటిల్ అనౌన్స్ చేసే సెంటిమెంటే ఓ కారణమని చెప్పొచ్చు. మరి SSMB 28 టైటిల్ అనౌన్స్మెంట్ ఎప్పుడుంటుందో చూడాలి.