JGL: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 2న జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ రాజగౌడ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో నిర్వహించిన జూమ్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ.. గ్రామసభల ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పురోగతిని ప్రజలకు వివరించాలన్నారు. సభ నిర్వహణకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.