MBNR: ఏజెన్సీల ద్వారా అవుట్ సోర్సింగ్ సిబ్బంది శ్రమ దోపిడీకి గురవుతున్నారని జిల్లా ఏఐటీయూసీ నేత గోపాల్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి, నేరుగా ప్రభుత్వ కార్పొరేషన్ ద్వారానే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు గండి పడకుండా, కార్మికులకు న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.