»Katapalli Venkataramana Reddy Mla Who Wants To Demolish His Own House For Road Widening
Katapalli Venkataramana Reddy: రోడ్డు విస్తరణలో సొంత ఇంటినే కూల్చమన్న ఎమ్మెల్యే
నాయకుడు అంటే ఏంటో మనకు తెలుసు, చిన్నస్థాయి లీడర్ అయినా సరే తన పెత్తనాన్ని, అధికారాన్ని చెలాయిస్తూ తన పని చేసుకుంటాడు. అయితే ఈ ఎమ్మెల్యే చేసిన పనికి అందరూ అవాక్కు అవుతున్నారు. ఈరోజుల్లో నాయకుడికి ఉండవల్సిన ఒక్క లక్షణం కూడా లేదని ఆశ్చర్యపోతున్నారు.
Katapalli Venkataramana Reddy MLA who wants to demolish his own house for road widening
Katapalli Venkataramana Reddy: నాయకుడు అంటే ఎలా ఉండాలో పుస్తకాల్లో చదివాము, లీడర్లు ఇలా ఉంటారా అని ప్రత్యక్షంగా చూశాము కానీ ఎమ్మల్యే కాటపల్లి వెంకటరమణా రెడ్డి(Katapalli Venkataramana Reddy)ని చూస్తే రాజకీయ నాయకులు ఇలా కూడా ఉంటారా అని అనిపించక మానదు. ఇద్దరు సీఎం అభ్యర్థుల మీద గెలిచి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యక్తి కామారెడ్డి ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణా రెడ్డి(Katapalli Venkataramana Reddy). మార్పు మన నుంచి మొదలు కావాలని నమ్మే వ్యక్తి. రోడ్డు విస్తరణలో భాగంగా ఆయన నివాసం ఉంటున్న ఇంటిని కూల్చేయడం అంటే మాములు విషయం కాదు. చోటామోటా లీడర్లే నానా రకాల పైరవీలు చేసి దాన్ని అడ్డుకుంటారు. కానీ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన వెంకటరమణా రెడ్డి మంచి జరగాలంటే తాను నష్టపోయినా సిద్దమే అని ఇల్లు ఖాళీ చేసి మరో ఇంట్లో ఉంటున్నారు.
ఇది త్యాగం చేయడమో, గొప్ప పనిచేస్తున్నట్లో ఆయన భావించడం లేదు. రాజు నీతిగా ఉంటే ప్రజలు నీతిగా ఉంటారు అని అంటున్నారు. మున్సిపల్ శాఖ కెటాయించిన రోడ్డుకు తన ఇళ్లు ఎంతవరకు కావాలో దాన్ని ఇచ్చినట్లు పేర్కొన్నారు. దీని ద్వారా రోడ్డును కబ్జా చేసిన వారు కూడా స్వచ్చందంగా ప్రభుత్వం స్థలాన్ని తిరిగి ఇవ్వాలన్నారు. ఆయన చేసిన పనికి కామారెడ్డిలోనే కాదు రాష్ట్రం నలువైపుల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.