Record in the history of tennis... Rohan Bopanna in number one place
Rohan Bopanna: భారత టెన్నిస్ చరిత్రలో భారత స్టార్ ప్లేయర్ రోహన్ బోపన్న (Rohan Bopanna) రికార్డు క్రియేట్ చేశాడు. 43 ఏళ్ల వయసులో డబుల్స్ విభాగంలో నంబర్‌వన్ ర్యాంకర్‌గా నిలిచడు. తాజాగా డబుల్స్‌లో తన పార్ట్నర్ మాథ్యూ ఎబ్డెన్తో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్‌కు చేరుకోని ఈ ఫీట్‌ను సాధించారు. క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా ద్వయం మాక్సిమో గొంజాలెజ్-ఆండ్రెస్ మోల్టేనిపై వరుస సెట్లలో 6-4, 7-5 తేడాతో రోహన్ జోడీ నెగ్గింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు ముందు బోపన్న మూడో ర్యాంక్‌లో పరిమితం అయ్యాడు. వచ్చే వారం తాజా అప్డేట్ జాబితా విడుదల అవుతుంది. తన డబుల్స్ పార్ట్నర్ మాథ్యూ ఎబ్డెన్ రెండో ర్యాంకులో ఉన్నాడు.
ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకుకు సాధించడం బోపన్న స్పందించాడు. తన 20 ఏళ్ల టెన్నిస్ కెరీర్లో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఏళ్లపాటు టోర్నీలు ఆడుతూ ఈ స్థాయికి చేరుకోవడం ఆనందంగా ఉందన్నారు. భారత్ తరఫున టాప్ ర్యాంకు సాధించడం గర్వకారణమని. ఈ ప్రయాణం ఇంకా ఇలాగే కొనసాగుతుందని, దాని కోసం నిరంతరం కష్టపడుతానని పేర్కొన్నారు. ఈ విజయం తనకు ఒక్కడికే కాదు టీమ్ మొత్తానికి వర్తిస్తుందని వెల్లడించారు. కుటుంబం, కోచ్, ఫిజియో, తన స్నేహితులు, అభిమానులు అందరి విజయం అన్నారు. ఇది భారత టెన్నిస్‌కు అత్యంత ముఖ్యం. మరింత మంది క్రీడాకారులు రావడానికి మార్గం చూపిస్తుందని భావిస్తున్నా అని వ్యాఖ్యానించాడు.