Budget expectations: ఆరోగ్య సంరక్షణ రంగం ఆశలన్ని ఈ బడ్జెట్‌పైనే
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ పై ఆరోగ్య సంరక్షణ రంగం ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంది. మంచి బడ్జెన్‌ను కెటాయించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Budget expectations: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామన్ 2024-25 మధ్యంతర ఆర్థిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. ఏడాది చివర్లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నందున పొలిటికల్ ప్రెషర్ ఉన్నప్పటికీ ఆరోగ్య సంరక్షణ రంగం ఈ బడ్జెట్‌పై ఆశాజనకంగా ఉన్నట్లు తెలుస్తుంది. దేశ శ్రేయస్సులో ముఖ్యమైన ఆరోగ్య సంరక్షణ రంగానికి కావాల్సిన ప్రాధాన్యత ఉంటుందని నిపుణలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దేశ ఆర్థిక వృద్ధి బలపడాలంటే ఆరోగ్య సంరక్షణ రంగానికి తగినంత ప్రాముఖ్యత ఇవ్వాలని ప్రిస్టిన్ కేర్ సహ వ్యవస్థాపకుడు డాక్టర్ వైభవ్ కపూర్ అన్నారు. హెల్త్‌కేర్ టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కిల్డ్ మెడికల్ వర్క్‌ఫోర్స్‌లో పెట్టుబడులు పెరగాలని ఆశిస్తున్నారు. “జనాభాలో కనీసం 30% మంది లేదా 40 కోట్ల మంది వ్యక్తులు – మిస్సింగ్ మిడిల్ అని పిలుస్తారు– ఆరోగ్య బీమాకు ఎలాంటి ఆర్థిక రక్షణ లేదు. దాన్ని సులభంగా యాక్సెస్ చేయడంపై ప్రత్యేక శ్రద్ధ ఉండాలి అని కపూర్ తెలిపారు.
2023-24 బడ్జెట్లో, ఆరోగ్య రంగానికి రూ. 89,565 కోట్లు కేటాయించారు, జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం)కి రూ. 35,947 కోట్లు కేటాయించారు అని ఘోష్ పేర్కొన్నారు. ప్రయాగ్ హాస్పిటల్స్ గ్రూప్ CEO ప్రితికా సింగ్, ఆరోగ్య సంరక్షణను పెంపొందించడంలో బడ్జెట్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మౌలిక సదుపాయాల మెరుగుదల, అధునాతన వైద్య సాంకేతికతలకు కేటాయింపులు, పరిశోధన, అభివృద్ధికి మద్దతు పెంచాలని అన్నారు. అలాగే ఆరోగ్య సంరక్షణ పెట్టుబడులకు పన్ను రాయితీలు, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాల కోసం ఈజీ పద్దతిని, వైద్య విద్య కోసం బడ్జెట్ పెంచాలని సింగ్ చెప్పారు.