»Finance Minister Nirmala Sitharaman Introduce The Interim Budget Is Focusing On These 5 Sectors
Interim Budget: ఈ 5 రంగాలపైనే అందరి దృష్టి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామన్ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న విషయం తెలిసిందే. లోక్ సభ ఎన్నిలు సీమీపిస్తుండడంతో ఈ బడ్జెట్లో 5 రంగాలపైనే అందరి దృష్టి ఉంది.
Finance Minister Nirmala Sitharaman, introduce the Interim Budget, is focusing on these 5 sectors
Interim Budget: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ 2024 ను ప్రవేశపెట్టబోతున్నారు. దీని గురించి సీతారామన్ మాట్లాడారు. ఎన్నికల ముందు ప్రవేశపెట్టబోయే చివరి బడ్జెట్ ఓటర్లను దృష్టిలో పెట్టుకొనే ఉంటుందని, ఏ ప్రభుత్వమైన అదే చేస్తుందని పేర్కొన్నారు. కాబట్టి ప్రభుత్వం సమర్పించే బడ్జెట్ కొత్త ప్రభుత్వం వచ్చే వరకు ప్రభుత్వ ఖర్చులను తీర్చడానికి మాత్రమే అని ఆర్థిక మంత్రి అన్నారు. ఏప్రిల్-మే సాధారణ ఎన్నికల తర్వాత ఎన్నికైన కొత్త ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్‌ను జూలైలో సమర్పించనుంది. ఈ మధ్యంతర బడ్జెట్లో ప్రధానంగా 5 ప్రధాన అంశాలు కీలకం కానున్నాయి.
ఆర్థిక వృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు, రాబోయే బడ్జెట్లో ముఖ్యంగా మౌలిక సదుపాయాల రంగం కోసం మూలధన వ్యయాన్ని పెంచడంలో ప్రభుత్వం దృష్టి సారించనుంది. ICRA తన ప్రీ-బడ్జెట్ అంచనాలలో ఏం తెలిపిందంటే.. “FY25లో10.2 లక్షల కోట్ల కాపెక్స్ కోసం భారత ప్రభుత్వం బడ్జెట్‌ను అంచనా వేస్తుందని, ఇది సాపేక్షంగా 10 చొప్పున విస్తరణను కొనసాగిస్తుందని అంచనా వేసినట్లు తెలిపింది. కోవిడ్ తరువాత క్యాపెక్స్ వృద్ధిలో మందగమనం, ఆర్థిక కార్యకలాపాలు, GDP వృద్ధిపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఉద్యోగ కల్పనలు
గ్రామీణ రంగంలో ఉద్యోగాలను సృష్టించేందుకు, గ్రామీణ మౌలిక సదుపాయాలపై పెట్టుబడిని పెంచడానికి రసాయనాలు,సేవల వంటి రంగాలకు ఉత్పత్తి ప్రోత్సాహక (PLI) పథకాలను ప్రోత్యహించే అవకాశం ఉంది. గ్రామీణ మౌలిక సదుపాయాలను నిర్మించడం, రసాయనాలు, సేవల వంటి రంగాలకు PLI పథకాల పరిధిని విస్తరింపజేసే అవకాశం ఉందని డెలాయిట్ తెలిపింది.
ద్రవ్య లోటు
ఎన్నికల ఒత్తిడి ఉన్నప్పటికీ, బడ్జెట్లో భారత స్థూల జాతీయోత్పత్తి (GDP)లో 5.3 శాతానికి ఆర్థిక లోటును మరింత తగ్గించే అవకాశం ఉందని బోఫా సెక్యూరిటీస్ ఒక నోట్లో పేర్కొంది. ఆర్థిక లోటును 5.9 శాతానికి తగ్గించేందుకు ప్రభుత్వం FY24 నిబద్ధతకు కట్టుబడి ఉంటుందని పేర్కొంది.
సామాజిక పథకాలు
కేంద్ర ప్రభుత్వం రాబోయే మధ్యంతర బడ్జెట్లో సామాజిక రంగ పథకాలకు అధిక నిధులను కేటాయించవచ్చు,
మూలాధారాలను పెంచుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం, కార్పొరేట్ పన్నుల నుంచి వసూళ్లు తగ్గే అవకాశం ఉంది. మొత్తం ప్రత్యక్ష పన్ను మాప్-అప్ బడ్జెట్ అంచనాలను దాదాపు 1 లక్ష కోట్లు మించి ఉండబోవు అని తెలుస్తుంది.
వినియోగం
వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో, వినియోగ డిమాండ్‌ను పెంచే కొన్ని చర్యలను ఆర్థిక మంత్రి ప్రకటించవచ్చు. అంచనాల ప్రకారం, వ్యవసాయ రంగ వృద్ధి 2022-23లో 4 శాతం నుండి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.8 శాతానికి తగ్గుతుందని అంచనా.