కర్నూల్ పీజీఆర్ఎస్లో వైడబ్ల్యూసీఎస్ను ఆప్కోలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మిగనూరు పట్టణ అధ్యక్షుడు వీజీఏ దయాసాగర్ జాయింట్ కలెక్టర్కు సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ నిర్ణయంతో చేనేత కార్మికుల జీవనాధారం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు స్పందించి పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు.