Actress Pragati : సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటి ప్రగతి ఎంత పాపులారిటీ సంపాదించిందో మనందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఆమె తల్లి పాత్రలు పోషిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన బాబీ సినిమా ద్వారా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. అంతకు ముందు చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించినా అవి ఎప్పుడు వచ్చాయో, ఎప్పుడు వెళ్లిపోయాయో కూడా ఎవరికీ తెలియదు. హీరోయిన్ గా రాణించలేక పోయినా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మాత్రం మంచి క్రేజ్ సంపాదించుకుంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన హాట్ ఫోటోలు, వీడియోలను అప్ లోడ్ చేస్తూ యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. మీరు ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను తెరిస్తే, మీరు ఎక్కువగా వర్కౌట్ వీడియోలను చూస్తారు.
ఎక్కువగా వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ ఒలింపిక్ ఛాంపియన్ రేంజ్ లో ప్రగతి నిరూపించుకుంది. ఇటీవల, ఆమె 2024 సంవత్సరానికి సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ పోటీలో పాల్గొని రజత పతకాన్ని గెలుచుకుంది. ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను అప్లోడ్ చేసింది. తమ తోటి నటి ప్రతిష్టాత్మక పోటీల్లో పాల్గొని రజత పతకాన్ని గెలుచుకోవడం గర్వంగా ఉందని ప్రగతి ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌పై నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.