»Actress Pragathi Who Won Bronze In National Powerlifting Competition Video Viral
Actress Pragathi: జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో కాంస్యం సాధించిన నటి ప్రగతి..వీడియో వైరల్
నటి ప్రగతి నేషనల్ లెవర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొని కాంస్య పతకాన్ని సాధించారు. ఈ విషయాన్ని ఆమె చెబుతూ ఓ వీడియోను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియోకు నెటిజన్లు ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
సినిమాల్లో వదిన, తల్లి, అక్క లాంటి క్యారెక్టర్స్ వేసి నటి ప్రగతి (Actress Pragathi) ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం బిజీగా ఉండే క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఆమె కూడా ఉన్నారు. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ భాషల్లోనూ ఆమె నటిస్తున్నారు. అటు సినిమాలు చేస్తూనే ఇటు సోషల్ మీడియాలో ఆమె ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటారు. ప్రగతికి నటనతో పాటు జిమ్‌కు వెళ్లడం అంటే కూడా ఎంతో ఇష్టం. ఆమె తన జిమ్ వీడియోలను (Gym Videos) సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. తాను చేసే వర్కౌట్లు, వెయిల్ లిఫ్టింగ్ వీడియోలను ష్యాన్స్కు షేర్ చేస్తూ ఉంటారు.
తాజాగా నటి ప్రగతి నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ (National Lifting Championship) పోటీల్లో కాంస్య పతకాన్ని సాధించారు. బ్రెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్ పోటీల్లో (Competitions) ఆమె సత్తా చాటారు. బెంగళూరు వేదికగా జరిగిన 28వ మహిళల నేషనల్ లెవల్ ఛాంపియన్షిప్ (Womens National level Championships) పోటీల్లో ఆమె పాల్గొని మూడో స్థానంలో నిలిచారు. బెంగళూరులోని ఇంజినీర్స్ అసోసియేషన్ ఆడిటోరియం వేదికగా ఈ పోటీలను నిర్వహించారు. ఆ పోటీల్లో కాంస్య పతకాన్ని (Bronze Medal) గెలవడం ఆనందంగా ఉందని నటి ప్రగతి వెల్లడించారు.
తాను కాంస్య పతకాన్ని (Bronze Medal) అందుకుంటున్న వీడియోను కూడా ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఓ నోట్‌ను కూడా రాసుకొచ్చారు. తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయని, చెడు నిర్ణయాలు, హార్ట్ బ్రేక్స్ వంటి వాటితో తన జీవితం ముగిసిపోయిందని అనుకున్నానని, కానీ ఇలాంటివి తన జీవితానికి ఉత్సాహాన్ని ఇచ్చి జీవితంపై ఆశలు పెంచుతాయని అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా పోరాడటమే జీవితానికి విజయ మంత్రం అని ఆమె తెలిపారు. ప్రస్తుతం నటి ప్రగతి షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Video Viral) అవుతోంది. సినీ ప్రముఖులు, నెటిజన్లు ఆమె వీడియోకు అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.