తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ నటి ప్రగతి (Actress Pragathi) అగ్ర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకుంది.. గొప్ప హీరోయిన్ కావాలన్న ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రగతి.. చివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయింది.భర్తతో గొడవల కారణంగా విడాకులు తీసుకుంది.అయితే ప్రగతి ఓ ప్రముఖ నిర్మాత(Producer)ను సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతుందంటూ ప్రస్తుతం నెట్టింట టాక్ వినిపిస్తోంది. ఓ నిర్మాత ప్రగతిని పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టారట. కాగా చిన్న రిమార్క్ కూడా లేని ఆ ప్రొడ్యూసర్ అలా అడగడంతో ఈమె కూడా అతడిపై ఇంట్రెస్ట్ చూసిస్తుందని సమాచారం.
చిన్న వయసులోనే ప్రేమించి పెళ్లి (Wedding) చేసుకున్న ప్రగతి.. ఆ తర్వాత భర్తతో గొడవల కారణంగా విడాకులు తీసుకుంది. ఇద్దరు పిల్లలతో సింగిల్ మదర్ గా జీవితాన్ని గడుపుతోంది. తెలిసీ తెలియని వయసులో పెళ్లి చేసుకుని పెద్ద తప్పు చేశానని ఆమె పలు ఇంటర్వ్యూలలో చెప్పిన సంగతి తెలిసిందే. సదరు నిర్మాతే ప్రగతి వద్ద మ్యారేజ్ ప్రపోజల్ తెచ్చినట్టు సమాచారం. ప్రగతి వయసు 47 ఏళ్లు. 21 ఏళ్ల వయసులోనే భర్తతో ఆమె విడిపోయింది. అప్పటి నుంచి ఆమె పెళ్లి చేసుకోలేదు.చిరుత, నువ్వు లేక నేను లేను, దూకుడు, డమరుకం, బద్రీనాథ్, డీజే టిల్లు (DJ Tillu) వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇకపోతే తాజాగా ఈ నటి పెళ్లి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది