అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ క్రతువు ముగిసింది. భక్తుల రామనామ స్మరణతో అయోధ్య నిండిపోయింది. బాలరాముడు ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభువు శ్రీరాముడికి క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు.
Narendra Modi: అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ క్రతువు ముగిసింది. భక్తుల రామనామ స్మరణతో అయోధ్య నిండిపోయింది. బాలరాముడు ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభువు శ్రీరాముడికి క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. తమ ప్రయత్నంలో, త్యాగంలో ఏవైనా లోపాలు జరిగి ఉంటే క్షమించాలని ప్రధాని మోదీ రాముడిని కోరారు. ఇన్ని శతాబ్దాల నుంచి ఈ పని జరగనందుకు క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. శ్రీరాముడి జన్మభూమిలో రామాలయ నిర్మాణం పూర్తి అయ్యిందని, ఇప్పుడు శ్రీరాముడు కచ్చితంగా క్షమిస్తారని ఆశిస్తున్నట్లు మోదీ తెలిపారు.
ఇది రాముడి వివాదం కాదు. ఆయన సమాధానమని తెలిపారు. రాముడు వర్తమానం కాదని.. అనంత కాలం అన్నారు. రామ మందిర నిర్మాణం కోసం దశాబ్దాల పాటు న్యాయ పోరాటం సాగిందని, న్యాయమైన తీర్పును ఇచ్చిన న్యాయవ్యవస్థకు మోదీ ధన్యవాదాలు కూడా తెలిపారు. రాముడి రూపంలో దేశం చైతన్య మందిరంగా మారిందని ప్రధాన మోదీ తెలిపారు. ఈరోజు దేశమంతా దీపావళి జరుపుకుంటోంది. ఈ రాత్రికి ప్రతి ఇంటా రామజ్యోతి వెలగాలి. శ్రీరాముడి ఆశీస్సులతో ఈ అద్భుత ఘట్టంలో పాల్గొనే అవకాశం దక్కిందని మోదీ తెలిపారు.