Delhi a man could not bear the cold and lit a fire next to it and died
Fire Accident : చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని ప్రాథమిక బోర్డింగ్ పాఠశాలలోని వసతి గృహంలో జరిగిన అగ్ని ప్రమాదంలో కనీసం 13 మంది మరణించారు. శుక్రవారం (జనవరి 19) రాత్రి 11 గంటలకు యన్షాన్పు గ్రామంలోని స్థానిక ప్రజలు యింగ్‌కై స్కూల్లో అగ్నిప్రమాదం జరిగినట్లు చైనా ప్రభుత్వ మీడియా జిన్హువా నివేదించింది. రెస్క్యూ టీం సంఘటనా స్థలానికి చేరుకుని.. రాత్రి 11:38 గంటలకు మంటలు అదుపులోకి తీసుకొచ్చాయి. అయితే మృతుల్లో ఎంత మంది విద్యార్థులు ఉన్నారనే విషయంపై ప్రస్తుతం స్పష్టత లేదు. ఈ ఘటనలో ఒకరు గాయపడగా, ప్రస్తుతం స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానిక మీడియా సమాచారం మేరకు పాఠశాల యాజమాన్యాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అత్యధిక జనసాంద్రత కలిగిన దేశాల్లో ఒకటిగా ఉన్నప్పటికీ భద్రతా ప్రమాణాలు లేకపోవడం వల్ల చైనాలోని అనేక ప్రావిన్సులలో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. పాఠశాల అగ్ని ప్రమాదం తర్వాత, ప్రజలు చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏదైనా భద్రతా లోపానికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. చైనాకు చెందిన ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఇలా రాశాడు, ఇది చాలా భయానకంగా ఉంది, 13 కుటుంబాలకు చెందిన 13 మంది పిల్లలు, అందరూ ఒక్క క్షణంలో వెళ్లిపోయారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.