»Horoscope Today Todays Horoscope 2024 January 20th Will Travel In Vain
Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 January 20th).. వృథా ప్రయాణాలు చేస్తారు
ఈ రోజు(2024 January 20th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మేషం
కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనం వహించడం మేలు. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. అనవసర ధనవ్యయంతో రుణప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అనారోగ్య బాధలకు ఔషధసేవ అవసరం. వృషభం
కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉండవు. మిథునం
కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృథా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధు, మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తి, ఉద్యోగరంగాల్లో సహనం వహించక తప్పదు.
కర్కాటకం
కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండటం మంచిది. సింహం
వ్యాపారంలో విశేషలాభాన్ని ఆర్జిస్తారు. మంచివారితో స్నేహం చేస్తారు. అంతటా సుఖమే లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కన్య
మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి.
తుల
విదేశయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మెలకువగా ఉండటం అవసరం. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. రుణలాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఉంటాయి. వృశ్చికం
కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదావేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. స్థిర నివాసం ఉంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. ప్రయత్నకార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు. ధనుస్సు
గౌరవ మర్యాదలకు లోపముండదు. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం గడుపవలసి వస్తుంది. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. శారీరకంగా బలహీనులవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
మకరం
మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన, వస్తు, వస్త్ర ఆభరణాలను పొందుతారు. కుంభం
కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ఆత్మీయుల సహాయ సహకారాలకోసం సమయం వెచ్చించాల్సి వస్తుంది. మీనం
వృత్తి, ఉద్యోగరంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలు ఉంటాయి. ఏ విషయంలోను స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా, గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడటం మంచిది.