PLD: పెదకూరపాడులో సోమవారం ఉదయం పోలీసులు భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డివిజన్ పరిధిలోని పోలీసు బలగాలు గ్రామంలోని ప్రతి నివాసాన్ని జల్లెడ పట్టాయి. మారణాయుధాలు, సరైన పత్రాలు లేని వాహనాల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి సారించారు. నేరాల నియంత్రణలో భాగంగా ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంచుకుని ఈ తనిఖీలు చేపడుతున్నామని అధికారులు వెల్లడించారు.