»Prashanth Varma Father Emotional On Hanuman Movie And Given Review
Hanuman : ఆ సినిమా తీసినది నా కొడుకు.. ప్రౌడ్ ఫాదర్ మూమెంట్
ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో హనుమాన్ పేరు మార్మోగిపోతుంది. జాంబి రెడ్డి సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సంక్రాంతి కానుకగా వచ్చిన బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.
Hanuman : ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో హనుమాన్ పేరు మార్మోగిపోతుంది. జాంబి రెడ్డి సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సంక్రాంతి కానుకగా వచ్చిన బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా చూసిన వారంతా దర్శకుడు, హీరో తేజను మెచ్చుకుంటున్నారు. చాలా తక్కువ బడ్జెట్లో అద్భుతమైన సినిమా చూపించారని తెగ పొగిడేస్తున్నారు. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ , విజువల్స్ హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయని చెబుతున్నారు. అయితే తాజాగా ఈ సినిమా చూసిన ప్రశాంత్ వర్మ తండ్రి మూవీపై రివ్యూ ఇచ్చాడు.
సాధారణ ప్రేక్షకుడిలా ఓ థియేటర్లో సినిమా చూసి బయటకు వచ్చాడు ప్రశాంత్ వర్మ తండ్రి. అయితే తనెవరో తెలియని కొంతమంది రిపోర్టర్లు కెమెరాలు పెట్టి సినిమా ఎలా ఉందని అడుగుతారు. దీనికి ఆయన సమాధానమిస్తూ.. నేను ప్రశాంత్ వర్మ తండ్రిని, హనుమాన్ తీసినోడు నా కొడుకు.. ప్రశాంత్ వర్మ తండ్రిని అయినందుకు గొప్పగా భావిస్తున్నాను అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు. హనుమాన్ అద్భుతంగా ఉందని, ఇది ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అని అందరూ బాగా నటించారని చెప్పుకొచ్చారు. ఇక ఇది చూసిన నెటిజన్లు కొడుకు విజయాన్ని చూసి గర్వ పడుతున్న తండ్రి ఆనందం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.