»Warning To The Planet 2023 Will Be The Hottest Year
Temperature: మానవాళికి హెచ్చరిక.. అత్యంత వేడిసంవత్సరంగా 2023
ఉష్ణోగ్రతలో 2016 రికార్డును 2023 బ్రేక్ చేసింది. ఇది ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 14.98 డిగ్రీల కంటే 0.17 డిగ్రీలు ఎక్కువ. మరో వైపు అంటార్కిటిక్ సముద్రపు మంచు కూడా కరిగిపోవడం ఆందోళన కలిగిస్తుంది.
Warning to the planet.. 2023 will be the hottest year
Temperature: రోజురోజుకు ఉష్ణోగ్రత(temperature) పెరుగుతుంది. 2023 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు అయింది. గత రికార్డులతో పోలిస్తే 2023లో 1.48 డిగ్రీలు అత్యధికంగా నమోదై పారిస్ ఒప్పందంలో నిర్దేశించిన 1.5 డిగ్రీల థ్రెషోల్డ్‌కు చేరువైంది. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఇలా పెరగడంపై సర్వత్ర ఆందోళన కలుగజేస్తుంది. ఇది కచ్చితంగా భవిష్యత్తులో విపత్తులకు నిదర్శనమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే పర్యావరణ వ్యవస్థలు తీవ్ర ముప్పును ఎదుర్కొవలసి వస్తుందని ప్రపంచవ్యాప్తంగా హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
ఉష్ణోగ్రతల్లో 2016 రికార్డును 2023 బద్దలుగొట్టింది. గత ఏడాది హాటెస్ట్ క్యాలెండర్ ఇయర్‌గా నమోదైంది. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 14.98 డిగ్రీల కంటే 2023లో నమోదైన ఉష్ణోగ్రత 0.17 డిగ్రీలు అధికం. భూగోళం వేడుక్కుతోంది అనడానికి ఇదే సాక్ష్యం. మరోవైపు, అంటార్కిటిక్ సముద్రంలో మంచు రోజురోజుకు కరిగిపోతుంది. గతేడాది అంటార్కిటిక్ సముద్రపు మంచు కరగడంలో రికార్డుస్థాయికి చేరుకుంది. అలాగే వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయులు కూడా పెరిగి 421 పీపీఎంకు చేరుకుంది. ఇది 14 మిలియన్ సంవత్సరాలకంటే అధికం అని పలు అంతర్జాతీయ కథనాలు వెలువడుతున్నాయి.