»Horoscope Today Todays Horoscope 2024 January 12th Expenses Will Increase
Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 January 12th)..ఖర్చులు పెరుగుతాయి!
ఈ రోజు(2024 January 12th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మేషం:
ఈ రాశివారు నేడు కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు తీరుతాయి. స్నేహితుల నుంచి సాయం అందుకుంటారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పైఅధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది.
వృషభం:
ఈ రాశివారికి రుణాలు అందుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. బంధువులతో స్వల్ప వివాదాలు తలెత్తుతాయి. ఉద్యోగులకు ఒత్తిడి తప్పదు. వ్యాపారంలో చికాకులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
మిథునం:
ఈ రాశివారు నేడు శుభవార్తలు వింటారు. ఉద్యోగులు ఇంక్రిమెంట్లను పొందుతారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఆదాయం బావుంటుంది.
కర్కాటకం:
ఈ రాశివారు నేడు ఏ పనులు చేపట్టినా అన్నీ సవ్యంగా పూర్తవుతాయి. సంఘంలో పరిచయాలు ఏర్పడుతాయి. ఆర్థికంగా లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వ్యాపారంలో కొత్త ప్రయత్నాలు చేపడుతారు. దైవ దర్శనాలు చేస్తారు. ఆరోగ్యం బావుంటుంది.
సింహం:
ఈ రాశివారు నేడు దూరప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బావుండదు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడి ఉంటుంది. పాతమిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. అధిక ఖర్చులు ఉంటాయి.
కన్య:
ఈ రాశివారు నేడు ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. రుణాల కోసం ప్రయత్నిస్తారు.. పనులలో జాప్యం జరుగుతుంది. బంధువులు, మిత్రులతో స్వల్ప వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు.
తుల:
ఈ రాశివారికి నేడు పనులు సకాలంలో పూర్తి అవుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. శుభవార్తలు వింటారు.
వృశ్చికం:
ఈ రాశివారు నేడు నూతన ఉత్సాహంతో పని చేస్తారు. పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు బాగా సాగుతాయి. ఆరోగ్యం బావుంటుంది.
ధనుస్సు:
ఈ రాశివారు నేడు తమ ప్రయాణాలను వాయిదా వేసుకునే అవకాశం ఉంది. బంధువుల నుంచి ఒత్తిడి తలెత్తుతుంది. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు బాగా సాగుతాయి. ఆరోగ్యం బావుంటుంది. ఆదాయం పర్వాలేదు.
మకరం:
ఈ రాశివారు నేడు చిక్కుల్లో పడతారు. కుటుంబంలో చికాకులు కలుగుతాయి. బంధువుల నుంచి ఒత్తిడి ఎదురవుతుంది. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటాయి. ఆరోగ్యం బావుంటుంది.
కుంభం:
ఈ రాశివారు నేడు చేపట్టిన అన్ని పనులలో విజయం సాధిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. ఆలయ దర్శనాలు చేస్తారు.
మీనం:
ఈ రాశివారికి నేడు చేపట్టిన అన్ని పనులలో నిరాశ కలుగుతుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అధికంగా డబ్బులు ఖర్చు పెడతారు. పనిభారం ఎక్కువవుతుంది. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. ఆరోగ్యం బావుంటుంది. ఆదాయం పర్వాలేదు.