పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి మూవీ పై భారీ అంచనాలున్నాయి. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. సడెన్ సర్ప్రైజ్ ఇస్తూ కల్కి టీజర్ రిలీజ్‌కు రెడీ అయ్యారని తెలుస్తోంది. ఇప్పటికే టీజర్ కట్ చేసినట్టుగా సమాచారం.
Kalki: జనవరి 12న కల్కి టీజర్ బయటకి రానుందా? అంటే, ఔననే అంటున్నారు. ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కల్కిని యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నాడు. దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో వైజయంతీ బ్యానర్ భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి జస్ట్ ఒక్క గ్లింప్స్ మాత్రమే రిలీజ్ అయింది. ఈ గ్లింప్స్‌కు సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఖచ్చితంగా కల్కి అద్భుతంగా ఉండే ఛాన్స్ ఉందంటూ కామెంట్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు సడెన్ సర్ప్రైజ్ ఇస్తూ.. టీజర్ రిలీజ్‌కు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
వాస్తవానికైతే ఈ సంక్రాంతికి జనవరి 12న కల్కి రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్ కంప్లీట్ అవకపోవడంతో పోస్ట్‌పోన్ చేశారు. దీంతో జనవరి 12న కల్కి కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. అంతేకాదు.. టీజర్ కూడా రిలీజ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పవర్ ఫుల్ టీజర్ కట్ చేశారట. 83 సెకన్ల రన్ టైంతో రానున్న ఈ టీజర్ మైండ్ బ్లోయింగ్ అనేలా ఉందని తెలుస్తోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ టీజర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఈ సినిమాను మే 9న రిలీజ్ చేస్తున్నట్టుగా టాక్ నడుస్తోంది.
ఆ రోజు నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌కు బాగా కలిసొచ్చిన రోజు కావడంతో.. దాదాపు ఇదే డేట్‌ను లాక్ చేసినట్టుగా సమాచారం. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే హీరోయిన్గా నటిస్తుండగా.. కమల్ హాసన్ విలన్‌గా నటిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీ రోల్ ప్లే చేస్తున్నారు. సలార్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో కల్కి పై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి కల్కి టీజర్ ఇంకెలాంటి హైప్ క్రియేట్ చేస్తుందో చూడాలి.